Home » Chief Minister
ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీల మధ్య చిచ్చుపెట్టడం, విడగొట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రస్తుతం బీజేపీ మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నందున అధికారం వారి చేతిలో ఉందనే విషయాన్ని తాను అంగీకరిస్తారనని అన్నారు.
ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయంగా ఉందని, అయితే ఏక్‌నాథ్ షిండే సంతోషంగా లేరని, ఆయన అసంతృప్తిని తొలగించాల్సి ఉంటుందని రామదాస్ అథవాలే అన్నారు.
మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్‌సత్ తెలిపారు.
షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నామని బీజేపీ అధిష్ఠానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. దేవేంద్ర ఫడ్నవిస్‌కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించడం, అందుకు తగ్గట్టే ఆయన సమర్ధవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నవిస్ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్ఠానం ప్రశంసలు అందుకుంటోంది.
ఈశాన్య ఢిల్లీలోని సుందర్ నగ్రిలో గత వారం హత్యకు గురైన 28 ఏళ్ల యువకుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె ఢిల్లీలోని శాంతిభద్రతల పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. హతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ తమతమ మేనిఫెస్టోలను విడుదల చేశాయని, ఎన్నికల అనంతరం మూడు పార్టీలకు చెందిన మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి హామీల ప్రాధ్యాన్యతా క్రమాన్ని నిర్ధారిస్తుందని అమిత్‌షా తెలిపారు.
జ మ్మూకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడే అవకాశం తమకు వచ్చిందని, ఈమధ్య కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయని, తాము (జమ్మూకశ్మీర్) ఎన్నో కోల్పోయామని అన్నారు.
గందేర్‌బల్ నియోజకవర్గం అబ్దుల్లా కుటుంబానికి కంచుకోటగా నిలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా 1977లోనూ, ప్రస్తుత అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా 1983, 1987, 1996లోనూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో పూజలు చేసి వివాదంలో చిక్కుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే వ్యవహారంలో ఆలయ నిర్వహకులు చర్యలు తీసుకున్నారు.