• Home » Chennur

Chennur

ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను ఉపసంహరించాలి

ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను ఉపసంహరించాలి

ఉపాధ్యాయుల సర్దు బాటు కోసం జారీ చేసిన మార్గదర్శకాలు సహేతుకం కాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని తపస్‌ జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం సరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015 నాటి రేషనలైజేషన్‌ నిబంధనల ప్రకారం 10 మందికి ఒక టీచర్‌, 60 మందికి ఇద్దరు టీచర్లు అనే నిబంధన అమలు చేయాలనుకోవడం సరికాదని, ఇది ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయడమే అవు తుందన్నారు.

చెరువు మత్తడి పేల్చివేత కేసులో నిందితుల అరెస్టు

చెరువు మత్తడి పేల్చివేత కేసులో నిందితుల అరెస్టు

పట్టణంలోని శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితులైన నలుగురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం చెన్నూరు పోలీస్‌స్టేషన్‌లో విలేక రుల సమావేశంలో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బేతాలివాడకు చెందిన పెండ్యాల లక్ష్మీనారాయణ, మారెమ్మవాడకు చెం దిన భీం మధుకర్‌, రాసమల్ల శ్రీనివాస్‌, ఏసీసీకి చెందిన గోగుల దానయ్యలు చెరువు మత్తడిని ధ్వంసం కేసులో అరెస్ట్‌ చేశామన్నారు.

దోషులను కఠినంగా శిక్షించాలి

దోషులను కఠినంగా శిక్షించాలి

శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు రాజారమేష్‌ డిమాం డ్‌ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెరువు మత్తడిని పేల్చడం హేయమైన చర్య అన్నారు.

Swacha : స్వచ్ఛకడప సాధనే లక్ష్యం

Swacha : స్వచ్ఛకడప సాధనే లక్ష్యం

ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌ స్వచ్ఛ కడప సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని మున్సిపల్‌ కమిషనరు వైవో నందన్‌ పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ 2024లో భాగంగా మహవీర్‌సర్కిల్‌ నుంచి ఆర్ట్స్‌కళాశాల మైదానం వరకు మారథాన్‌ ర్యాలీ చేపట్టారు.

పర్యాటకులను ఆకర్షిస్తున్న గొల్లవాగు ప్రాజెక్టు

పర్యాటకులను ఆకర్షిస్తున్న గొల్లవాగు ప్రాజెక్టు

మండల కేంద్రంలో ఉన్న గొల్లవాగు ప్రాజెక్టు పర్యా టకులను ఆకర్షిస్తుంది. మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో గొల్లవాగు ప్రాజెక్టును 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంతో జల వనరులు పెరిగి వ్యవసాయ మండ లంగా పేరుగాంచింది. వర్షాకాలంలో సం దర్శకుల తాకిడితో గొల్లవాగు ప్రాజెక్టు నిత్యం ప్రజలతో కళకళాడుతుంది.

పూర్తయిన ఊర చెరువు సర్వే

పూర్తయిన ఊర చెరువు సర్వే

మండల కేంద్రంలోని ఊర చెరువు సర్వే శుక్రవారంతో పూర్తయ్యింది. కొంత కాలంగా సర్వే చేసినప్పటికీ హద్దులకు నోచుకోకుండా పోయింది. భీమారం గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్‌కు ఫిర్యా దు చేయడంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు వారం రోజుల నుంచి సర్వే పనులు చేసి శుక్రవారం చెరువు హద్దులను ఏర్పాటు చేసి మార్కింగ్‌ పూర్తి చేశారు.

చెరువు సర్వే పనులు ప్రారంభం

చెరువు సర్వే పనులు ప్రారంభం

మండల కేంద్రంలోని ఊర చెరువు పూర్తిస్థాయి సర్వే పనులు ప్రారంభ మయ్యాయి. భీమారం గ్రామానికి చెందిన తైనేని రవి కలెక్టర్‌కు చెరువును రక్షించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమ వారం తహసీల్దార్‌ సదానందం, ఇరిగేషన్‌ డీఈ శారదలు ముగ్గురు సర్వేయర్లతో పాత మ్యాప్‌ ఆధా రంగా సర్వే పనులను ప్రారంభించారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ప్రభు త్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను, రికార్డులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు, చికున్‌ గున్యా, డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వం శీకృష్ణ అన్నారు. శుక్రవారం 5వ వార్డు గెర్రె కాలనీలో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా రూ.31 కోట్లతో నిర్మిం చనున్న వాటర్‌ ట్యాంకు పనులను ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు.

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

గణపతి ఉత్సవాలను, నిమజ్జనాన్ని ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. సంతోషి మాత ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన పీస్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మండపాల వద్ద ఎలాంటి గొడవలకు తావివ్వకూడదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి