Home » Chennai
నగరం నుంచి శివారు ప్రాంతాలకు నడుపుతున్న విద్యుత్ సబర్బన్ రైళ్లలో ప్రయాణం చేస్తున్నవారు ఎదురుగా వున్న సీట్లపై కాళ్లు పెడితే చట్టపరమైన చర్యలుంటాయని దక్షిణ రైల్వే హెచ్చరించింది. నగరం నుంచి ప్రతిరోజు తిరువళ్లూరు, ఆవడి, అరక్కోణం, తిరుత్తణి, గుమ్మిడిపూండి, సూళ్లూరుపేటలకు నడుపుతున్న విద్యుత్ సబర్బన్ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.
నగరంలో సూపర్ సిక్స్-సూపర్‌హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్‌ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
గ్రిల్ చికెన్‌లో ‘లెగ్ పీస్’ లేకుండా వడ్డించిన ఓ హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం రూ.10 వేల జరిమానా విధించింది. కేసు ఖర్చులకు మరో రూ.5వేలు కలిపి మొత్తం రూ.15వేలను వినియోగదారునికి చెల్లించాలని ఆదేశించింది.
ఆసుపత్రి వార్డులో రోగులను పరీక్షిస్తూ గుండెపోటుతో ఓ యువ గుండె శస్త్రచికిత్సా నిపుణుడు కుప్పకూలాడు.
గ్రాడ్లిన్ రాయ్ చెన్నైలోని సవీత మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కార్డియాక్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రతీ రోజూలాగే బుధవారం కూడా డ్యూటీకి వెళ్లాడు. ఆస్పత్రిలో రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు.
శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా, కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధమా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్‌కులేదని తమిళనాడు ప్రభుత్వం వాదించింది...
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కౌలాలంపూర్ నుంచి చైన్నై వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బయటికి వెళ్లే క్రమంలో ఓ జంటను చూడగానే అధికారులకు అనుమానం కలిగింది. చివరకు క్షుణ్ణంగా పరిశీలించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..
ప్రస్తుతం దేశంలో సమాఖ్యవాదం, రాజ్యాంగం ప్రమాదపుటంచుల్లో ఉన్నాయని, తనను గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు...
తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచీ శివను ఎంపికచేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు...