Home » Chennai
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఈశా యోగా కేంద్రం వ్యవహారంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన కేసును మూసివేసిన సుప్రీంకోర్టు.. మిగిలిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టవచ్చని పేర్కొంది.
చెన్నైకి ముప్పు తప్పింది. వాయుగుండం నేపథ్యంలో చెన్నై సహా 9 జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించిన వాతావరణశాఖ బుధవారం ఉపసంహరించుకుంది.
తమిళనాడులోని తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన విమానానికి పెద్ద ముప్పు తప్పింది. 141 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానం సాంకేతిక లోపంతో రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి.. చివరకు క్షేమంగా కిందకు దిగడంతో ఉత్కంఠకు తెరపడి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలే ఆదివారం..పైగా బీచ్‌లో మెగా ఎయిర్‌షో..! ఇంకేముంది ఉదయం 8గంటల నుంచే చెన్నై మెరీనా బీచ్‌కు జనం పోటెత్తారు. చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ లక్షలాదిగా తరలిరావడంతో బీచ్‌కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి.
తిరుగు ప్రయాణంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ, ఉక్కపోతతో సుమారు 230 మంది స్పృహ తప్పి పోయినట్టు తెలుస్తోంది. వీరిలో 93 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రులకు తరలించారు.
ప్యారీస్‌లోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల(Tirumala) గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavams) సందర్భంగా నగరానికి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో సూపర్ స్టార్ చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో రజినీకాంత్‌కి ముందస్తు చికిత్సలో భాగంగా ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆస్పత్రిలో చేరినట్లు చెప్పాయి. వైద్యులు గుండెకు సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం.
విజయవాడలో చెన్నై షాపింగ్‌మాల్‌ను తన చేతులమీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రీలీల అన్నారు. బందరురోడ్డులో ఏర్పాటుచేసిన చెన్నై షాపింగ్‌మాల్ నూతన షోరూంను
తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.
ఇద్దరు పిల్లలు గ్రాండ్‌మాస్టర్లు. వారి ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడుతుంటే ఆ తల్లి కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. న్యూస్ ఛానళ్లు పోటీ పడి ఇంటర్వ్యూలు తీసుకుంటుంటే ఆ తల్లి మనసు ఆనందంతో నిండిపోతోంది.