Home » Chennai
అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్‌లో భారత నౌకాదళం 500 కేజీల మాదకద్రవ్యాల(క్రిస్టల్ మెథంఫెటమైన్)ను స్వాధీనం చేసుకుంది.
ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ఉండాలని ఆ పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ, అండమాన్, తమిళనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జ్ కలిశెట్టి అప్పలనాయుడు(Kalisetti Appalanaidu) ఆకాంక్షించారు. చెన్నై టీడీపీ విభాగం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్నానగర్ టవర్ క్లబ్‌లో మంగళవారం ప్రారంభించింది.
ఓ ఆస్పత్రిలో ఓ యువకుడు వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ యవకుడు ఎందుకు దాడి చేశాడనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సినిమాల్లో కథానాయకుడు... రాజకీయాల్లో నాయకుడు కావాలనే ఆశ, లక్ష్యం! ఎప్పటికప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఒక అడుగు ముందుకు వేస్తూనే... ‘ఇప్పుడు కాదు’ అంటూ రెండు అడుగులు వెనక్కి వేసిన నేపథ్యం! ఇప్పుడు... ఎట్టకేలకు ఈ కథానాయకుడు రాజకీయ నాయకుడిగా అవతరించాడు.
రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలో ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పనిచేస్తున్న 16 ఏళ్ల బాలిక చిత్ర హింసలకు గురై హతమైంది. ఈ హత్యకేసులో ఆ పారిశ్రామికవేత్త, ఆయన భార్య సహా ఆరుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడు గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ఈశా యోగా కేంద్రం వ్యవహారంలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన కేసును మూసివేసిన సుప్రీంకోర్టు.. మిగిలిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ చేపట్టవచ్చని పేర్కొంది.
చెన్నైకి ముప్పు తప్పింది. వాయుగుండం నేపథ్యంలో చెన్నై సహా 9 జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించిన వాతావరణశాఖ బుధవారం ఉపసంహరించుకుంది.