Home » Chandrababu
కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29 ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బలపరిచారు.
రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.
ఏపీలో గత ఐదేళ్లలో ఒక్కటంటే.. ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చిన సందర్భమే లేదని భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ కేంద్రసహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నేడు ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకున్నారు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తనకు అవకాశం ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు.
టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని కోసం భూమిచ్చిన రైతులు దాదాపు ఐదేళ్ల పాటు తమ పోరాటాన్ని కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో రాజధాని గ్రామాల్లోని రైతులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రివర్గ ఆశావహులు పెద్దఎత్తున ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అధినేత దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరువుతున్నారు. జూన్ 12న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ (Kesarapalli IT park) సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు.. ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.