Home » Chandrababu
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని చంద్రబాబు నియమించారు.
పోలీసుల అష్ట దిగబంధనంలో బెజవాడ నగరం ఉంది. ప్రమాణ స్వీకారం పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారిని సైతం కనకదుర్గమ్మ వారధి వద్దనే పోలీసులు ఆపేస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలు అనుమతించడంతో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1978లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఏపీలో ‘కూటమి’ కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవ సందడి నెలకొంది. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యుల్లో పలువురు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడును గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రబాబు.. తన నివాసంలో విందు ఇస్తున్నారు.