• Home » Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

నటుడు సుమన్ తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5ఏళ్ళు వెన్నక్కి వెళ్ళిందన్నారు.

AP CM ChandraBabu: పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం

AP CM ChandraBabu: పోలవరం ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు.

Vangalapudi Anitha: హోం శాఖే ఎందుకు..?

Vangalapudi Anitha: హోం శాఖే ఎందుకు..?

ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.

Good News: అభ్యర్థులూ గెట్ రెడీ.. నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్..

Good News: అభ్యర్థులూ గెట్ రెడీ.. నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన వారికి సీఎం చంద్రబాబు అధికారం చేపడుతూనే అభ్యర్థుల కళ్లలో ఆనందం నింపారు. తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ పైనే పెట్టారు. ఇక ఇంతటితో అయిపోలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు సైతం వెలువడేందుకు సమయం ఆసన్నమైంది.

CM Chandrababu: పింఛన్‌ పథకానికి పేరు మార్పు

CM Chandrababu: పింఛన్‌ పథకానికి పేరు మార్పు

పింఛన్‌ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌ జెండర్లు వంటి వారికి వర్తించనుంది. రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల పెన్షన్ అయితే రూ.3 వేల నుంచి ఏకంగా రూ.6 వేలకు పెంచింది.

Chandrababu: హెచ్‌వోడీల సమావేశంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

Chandrababu: హెచ్‌వోడీల సమావేశంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

వివిధ శాఖాధిపతుల హెచ్‌వోడీల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు 1995లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు అంటే గౌరవం ఉండేది. కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ గాడి తప్పింది’’ అని అన్నారు.

Amaravathi: దటీజ్ చంద్రబాబు.. మాట నిలబెట్టుకునే నైజం

Amaravathi: దటీజ్ చంద్రబాబు.. మాట నిలబెట్టుకునే నైజం

ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు లేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు.

Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే

Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు.

Chandrababu: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Kolusu Parthasaradhi: ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పుడు ఆరోపణలు

Kolusu Parthasaradhi: ప్రజల దృష్టిని మళ్లించేందుకే తప్పుడు ఆరోపణలు

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చతికిల పడ్డాయని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. కేవలం చంద్రబాబుకి పేరు వస్తుందనే అహంకారంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించిన అన్ని సబ్సీడీలను వైసీపీ ఆపేసిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి