Home » Chandrababu
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. గతంలో అధికారంలో ఉండగా ఆయన తన భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రిగా ఆయన అసాధారణ రీతిలో తన భద్రత కోసం చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు.
స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పట్లో పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాక నివ్వనని వైసీపీ నేతలు చేసిన సవాల్‌ను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని.. వైసిపి వాళ్ళు వై నాట్ 175 అని 11 గెలిచారన్నారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదన్నారు.
ఇందుగలదు అందు లేదన్నట్లుగా.. వైసీపీ(YSRCP) ప్రభుత్వం హయాంలో ఏ శాఖలో చూసినా అవినీతే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh Government) ప్రభుత్వం మారిన తరువాత గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
CM Chandrababu Naidu Vistis Polavaram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. అయినాసరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలనకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏపీ పాలనలో తనదైన మర్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.