Home » Chandrababu
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది.
తమిళనాట తెలుగు భాషను కాపాడుకునేందుకు పోరాడుతున్న తెలుగు యువశక్తి సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. మాతృభాషాను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సాయం అర్థించారు. ఏపీలో ఇంటర్మీడియట్ వరకూ అన్ని తరగతుల్లో తెలుగు మాధ్యమంలో బోధనను తక్షణం పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు చేరుకున్న ఆయన.. ఏపీ ఎన్డీఏ ఎంపీలతో విందులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు.
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీపీ (Telugu Desam Parliamentary Party) నేతల వివరాలను లేఖ ద్వారా స్పీకర్‌కు తెలిపారు. లావు శ్రీకృష్ణ దేవరాయలును టీడీపీపీ నేతగా గుర్తించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలతో బుధవారం చిట్‌చాట్ చేశారు. పార్లమెంట్ ఒక విశ్వవిద్యాలయం అని, పార్లమెంట్‌లో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత ఎక్కువ నేర్చుకుంటారని ఎంపీలకు సూచించారు.