Home » Chandrababu naidu
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) ని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ( MLA Parthasarathy ) ఈనెల 11వ తేదీన కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో పార్థసారథి కలవనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) విధానాల వల్లే వైసీపీ ప్రభుత్వం ( YCP Govt ) అప్పు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ( Minister Buggana Rajendranath Reddy ) అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ... ఊరూరా తిరుగుతూ రాజకీయ సభల్లో చంద్రబాబు లోకేష్ వైసీపీ నేతలకు పేర్లు పెడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి మండిపడ్డారు.
హిందూపూర్ ( Hindupur ) లో వైసీపీ ( YCP ) బోణీ కొట్టడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Minister Peddireddy Ramachandra Reddy ) అన్నారు. బుధవారం నాడు హిందూపూర్‌లో పర్యటించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu )కు ఏపీ హైకోర్టు ( AP High Court ) లో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ( Minister Karumuri Nageswara Rao ) చేసేది ప్రజా దీవెన యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని టీడీపీ ( TDP ) మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ( Arimilli Radhakrishna ) విమర్శించారు.
రా.. కదలిరా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ( YCP ) ని చిత్తుగా ఓడిద్దామని తెలుగుదేశం ( TDP ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ఆచంట రా.. కదలిరా సభలో చంద్రబాబు ప్రసగించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ వ్యవస్థతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) భ్రష్టు పట్టించారని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ( Kanakamedala Ravindra Kumar ) అన్నారు. శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల 9నెలల జగన్మోహన్‌రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు.
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. శనివారం నాడు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు. షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.
మార్చాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రి జగన్ ( CM JAGAN ) నే అని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...గత ఎన్నికలల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాల్లో కొట్టుకొచ్చారని.. ఈసారి ఎన్నికల్లో వరదల్లో కొట్టుకుపోవడం ఖాయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం జగన్‌రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ఠ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu ) అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీల సమ్మె నిషేధించడానికి రాష్ట్రమేమైనా జగన్ రెడ్డి జాగీరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.