Home » Chandrababu naidu
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) కు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు.
Andhrapradesh: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ వేసిన పిటివారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.
Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణను సీబీఐకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఉండవల్లి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు గతంలో నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసింది.
ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోందని ఏపీసీసీ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న మణిపూర్‌లో పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చన్నారు. రాయలసీమకు పంగనామాలు, రైల్వే జోన్, పోలవరం లేదన్నారు. ఆఖరికి కృష్ణా జలాల పంపిణీలో కూడా మనకు అన్యాయం జరిగిందని తులసిరెడ్డి పేర్కొన్నారు.
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈకేసుపై నవంబర్ 30న విచారణ చేపడుతామని ఉన్నతన్యాయస్థానం ప్రకటించింది.
ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం విచారణ జరిగింది. విచారణలో భాగంగా చంద్రబాబును ఈనెల 28 వరకు అరెస్ట్ చేయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఏపీ పరువు మరోసారి గంగలో కలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అని క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది. బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యాల్సి ఉండగా చేయడం లేదని క్రిసెల్ వెల్లడించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుపై ఈనెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.
ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గవర్నర్ నజీర్‌తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం టీడీపీ సభ్యుల బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించామన్నారు.