Home » Chandrababu Naidu
విశాఖ శారదాపీఠానికి తక్షణమే భూకేటాయింపులను ర ద్దుచేయాలని, ఇందుకు ఫైలు పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ఫైలు పంపింది.
రాజధానికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామని, మరో మూడేళ్లలో అమరావతిని సుందరవనంగా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ఇబ్బందులు పడటంతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రమండలి సమావేశంలో చంద్రబాబు ఇసుక విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు..
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి రూ.2,424.463 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది.
ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.
ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?
తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్ సర్కార్ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ విషయంలో గతంలో ఇది జరిగింది.
జగన్ జమానాలో గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను మత్తురహితం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన ఈ రక్కసిని అంతం చేసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసులు నడుం బిగించారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.