Home » Chandrababu naidu
ఢిల్లీలో న్యాయవాదులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, పైబర్ నెట్ కేసులపై న్యాయవాదులతో చంద్రబాబు చర్చించారు.
Andhrapradesh: ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ... సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ... రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేస్తూ గత వారం ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala NageswaraRao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్ ( Jagdeeswar Gowd ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu ) కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సాయంత్రం సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా ( Siddhartha Luthra ) కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు హాజరుకానున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu ) ఈ నెల 30వ తేదీ సాయంత్రం తిరుమల ( Tirumala ) కు వెళ్లనున్నారు.
Chandrababu Case: మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణకు రాగా.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
Chandrababu Case: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఐఆర్‌ఆర్, ఇసుక కేసుల్లో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది.
కేసు మీద కేసు పెట్టాలా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) ను జైల్లో పెట్టాలనేదే జగన్‌రెడ్డి ( Jagan Reddy ) లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) ఎద్దేవ చేశారు.
Andhrapradesh: దెబ్బమీద దెబ్బతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.