Home » Chandrababu naidu
రైతులు అపోహలు నమ్మవద్దని... ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan )స్పష్టం చేశారు. శుక్రవారం నాడు కర్లపాలెం, బాపట్ల, అమరావతి ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. తుఫాసు సహయం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు భరోసా కల్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Andhrapradesh: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రేవంత్ ప్రమాణ స్వీకారంపై ఆంధ్రాలో వెలసిన బ్యానర్ ఆసక్తికరంగా మారింది.
Andhrapradesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది.
కాణిపాకంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భవనాన్ని రెవెన్యూ, ఆలయ అధికారులు కూల్చివేశారు. భవనం కూల్చివేతపై స్థానికులు, రైతులు ,టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో ప్రజలకు సాయం చేశామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ( Nara Chandrababu Naidu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో తుఫాన్‌పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధిత గ్రామాల ప్రజలతో చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైల్లో ఉండగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది.
యువ ఓటర్ల కోసం ‘‘టీడీపీ మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్’’ ఫోరం పేరుతో యువ ఓటర్ల కోసం కూకట్‌పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో టీడీపీ మద్దతు దారులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానలు, యువ ఓటర్లు పాలుపంచుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.
సింహాచలం ( Simhachalam ) అప్పన్న స్వామిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) దంపతులు దర్శించుకున్నారు. చంద్రాబాబు దంపతులకు వంశపారం పర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఆలయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు.