• Home » Chandra Babu

Chandra Babu

Gadde Rammohan: జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం

Gadde Rammohan: జగన్ మోసంతో ఒక్కో పేదకు 29 వేలు నష్టం

తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. వరలక్ష్మీ నగర్, నాగార్జున నగర్, పోలీస్ కాలనీల్లో పేదలకు స్వయంగా గద్దె రామ్మోహన్ పెన్షన్ అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ‌ పెన్షన్ తొలగించారని ఎమ్మెల్యేకు పలువురు వృద్దులు తెలిపారు. ఆగస్ట్‌లో అర్హత ఉన్న వారికి పెన్షన్ లు మంజూరు చేసేలా చూస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు.

CM Chandrababu: తెల్లారేపాటికి లబ్దిదారుల చేతిలో పింఛన్.. స్వయంగా రంగంలోకి చంద్రబాబు

CM Chandrababu: తెల్లారేపాటికి లబ్దిదారుల చేతిలో పింఛన్.. స్వయంగా రంగంలోకి చంద్రబాబు

ఒకటో తారీఖు వచ్చేసింది. పెన్షన్ వస్తుందా? లేదంటే లేటవుతుందా? అనే చింత లేకుండా తెల్లవారేపాటికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు.

 Eluru : నేడు పోలవరానికి  విదేశీ నిపుణుల బృందం

Eluru : నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం

ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రా జెక్టును ఆదివారం విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుం ది. ఈ బృంద సభ్యులు ఉదయం 9.45గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు.

Budda Venkanna: పదవులు వస్తాయి.. పోతాయి..  కానీ కమిట్మెంట్ ముఖ్యం

Budda Venkanna: పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ ముఖ్యం

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.

Lanka Dinakar: రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం

Lanka Dinakar: రివర్స్ టెండరింగ్ మంత్రం కారణంగా తీవ్రమైన నష్టం

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72% పూర్తైందని తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు.

D Srinivas: డి. శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

D Srinivas: డి. శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు.

Tirumala: తిరుమల ఈడీపీ ఆఫీస్‌లో సడెన్‌గా మంటలు.. డేటా తగులబెట్టేందుకు యత్నించారా?

Tirumala: తిరుమల ఈడీపీ ఆఫీస్‌లో సడెన్‌గా మంటలు.. డేటా తగులబెట్టేందుకు యత్నించారా?

వైకుంఠం ఎదురుగా వున్న ఈడీపీ ఆఫీస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కంప్రెజర్ నుంచి మంటలు చెలరేగడంతో ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Ganta Srinivasarao: ఆంధ్రా యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రం మార్చేశారని గంటా ఫైర్

Ganta Srinivasarao: ఆంధ్రా యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రం మార్చేశారని గంటా ఫైర్

ఆంధ్రా యూనివర్సిటీ ప్రమాణాలను, ప్రతిష్టను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విటర్ వేదికగా విమర్శించారు. వైస్ ఛాన్సలర్‌గా కరుడుగట్టిన వైసీపీవాది ప్రసాదరెడ్డిని నియమించి ఈ గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీ ప్రతిష్టను అమాంతం దిగజార్చారని విమర్శించారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించి యూనివర్సిటీని ఒక రాజకీయపార్టీ కార్యాలయంగా మార్చేశారని ఫైర్ అయ్యారు.

Chandrababu: ఏడు ప్రభుత్వ శాఖల స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు

Chandrababu: ఏడు ప్రభుత్వ శాఖల స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు

ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్ ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 30న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 30న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

డీఎస్సీ 2024 నోటిఫికేషన్‍ విడుదలకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహించలేదు. ఇప్పటి వరకూ టెట్ రాయని వారికి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి