Home » Chandra Babu
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీయే కూటమి ఎంపీల భేటీ జరిగింది. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు నూతన ఎంపీలు అందరూ ఆమోదం తెలిపింది. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికల్లో కూటమి భారీ విజయంతో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మెుదట జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఆరోజున మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తేదీని మార్చాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భారీ విజయం సాధించింది. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ లోపే వైసీపీ నుంచి జంపింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేశారని టీడీపీ చెన్నై విభాగానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు. టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆ పార్టీ చెన్నై విభాగ అధ్యక్షుడు డి.చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్‌కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీకి తక్కువ సీట్లు రావడంతో కూటమిలోని ప్రధాన పార్టీలు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొంది. మోదీ 3.O ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జేడీఎస్ కీ రోల్ పోషించనున్నాయి.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో ఆయన గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో..
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు శుక్రవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తన పార్టీ ఎంపీలతో కలసి గురువారం సాయంత్రం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.