Home » Chandra Babu
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తూ వచ్చిందని.. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, అధికారులు కూడబలుక్కుని ప్రాజెక్టులోని కీలకమైన నిర్మాణాలు కూల్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం తమ ఓటమిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. సీఎస్, డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే ఏపీ సీఎంఓ సిద్ధం చేసింది.
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
పాలనకు సమయం ఇస్తూనే టీడీపీకి సైతం టైం కేటాయించాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు..
కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ, కాళ్ళ దగ్గిరే పడి ఉంటానన్న పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నాడని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘వస్తే రాజ్యం... పొతే సైన్యం’ అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు.
ఈ రోజు సాయంత్రం 3.30 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలను కలువనున్నారు. ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చకచకా పనులు చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవాళ నారా భువనేశ్వరి సైతం ట్విటర్ వేదికగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబును తన ప్రాణం గానూ.. తనలో సగంగానూ భువనేశ్వరి పేర్కొన్నారు.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..