Home » Chandra Babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు....
ఈ నెల 24వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కెబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్‌గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారని ట్విటర్ వేదికగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని అన్నారు.
ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదని.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో ఎంపీ సీఎం రమేష్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు.
ఐదేళ్లు గిర్రున తిరిగాయి. అధికారం చేతులు మారేందుకు పెద్దగా సమయం పట్టలేదు. 151 సీట్లతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి పట్ట పగ్గాల్లేవ్ ఆ పార్టీ నేతలకు. ఫలితంగా జగన్ ప్రతిపక్ష హోదాను కోల్పోగా ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతోంది.
గౌరవ సభలోకి సీఎం చంద్రబాబు అడుగు పెట్టగానే.. సభ్యులు లేచి నుంచొని హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో అనేక మంది ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు.
శపథాలు చేయడం.. సవాళ్లు విసరడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే దానిని నెరవేర్చుకోవడమే చాలా కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. 2021 నవంబర్ 19న అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ శపథం చేశారు. దానిని నెరవేర్చుకుని నేడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో డ్రైన్‌లలో తట్ట మట్టి తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకి మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు. తనను గెలిపించి మంత్రిని చేసిన 70 వేల నియోజకవర్గ కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానన్నారు.
అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు.