Home » CBI
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణను సీబీఐ అధికారులు ప్రారంభించారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.
ఎస్‌బీఐ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగాయని బ్యాంకు తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులు కూడా మోసంలో భాగం అయినట్లు వెల్లడించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కేటీఆర్ ఉన్నారు. పలు కీలక విషయాలపై కేసీఆర్‌తో చర్చిస్తున్నారు.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులలో రూ.232 కోట్లకు పైగా తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలతో సంస్థ సీనియర్ మేనేజర్‌ను CBI అరెస్టు చేసింది. వాస్తవ అంకెలకు సున్నాలు జోడించి..తన షేర్ మార్కెట్ 'ట్రేడింగ్ ఖాతాలకు' బదిలీ చేశారని..
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్, హరీష్‌రావు పేర్కొన్నారు.
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది.