Home » CBI
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడగించింది.
Andhrapradesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం జగన్ కేసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడ్ అప్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఎంపీ హరీరామజోగయ్య ఈ పిటిషన్‌ను వేశారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై సమగ్రమైన సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి హైకోర్టు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చింది.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం (జూలై 1) ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు.
విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన నీట్ పేపర్ లీక్ కేసులో బాధితులకు న్యాయం దిశగా తొలి అడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి పట్నాలో ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్టు చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసింది.