Home » CBI
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన యూకే వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట కలిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గత 150 రోజులకు పైగా జైలులో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వస్తోన్నారు. ఈడీ కేసులో మాత్రమే కవితకు బెయిల్ లభించింది.
మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతోపాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సీబీఐ ఆదివారం సోదాలు జరిపింది.
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడని కోల్‌కతా పోలీసులు గతంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నిందితుడు మాత్రం తనను ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు CBI ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ చుద్దాం.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి చెస్ట్ విభాగం సెమినార్‌హాల్‌లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా..
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పెరగడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగినట్టు భావిస్తున్న ఆసుపత్రి సెమినార్ హాలు డోర్ బోల్డ్ విరిగిపోవడం తాజాగా సీబీఐ దృష్టికి వచ్చింది.
సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.