Home » Car Accident
నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ నంది కుమారుడు, కోడలు మంగళవారంనాడు జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని హుటాహుటిన లక్నోలోని ఆసుపత్రికి తరలించారు.
రాజీవ్ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్‌ను దాటి పక్క లైన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి.
కారులో వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడమే కాకుండా, బైకర్ ఏమయ్యాడో కూడా చూడకుండా మృతదేహాన్ని 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు ఓ కారు డ్రైవర్. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్‌ప్లాజా వద్ద జరిగింది.
వైద్యం కోసం ఖమ్మం వచ్చి.. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారిపాలిట మృత్యుశకటమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన ప్రమాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మరణించింది. కాజీపేట మండలం మడికొండలో శనివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కాజీపేట మండలం మడికొండ వద్ద కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. బలంగా కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.