Home » Budget 2025
TDS-TCS: బడ్జెట్-2025లో మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చింది. ఆదాయం పన్ను నుంచి టీడీఎస్-టీసీఎస్ వరకు చాలా అంశాల్లో ఊహించని శుభవార్తలు చెప్పింది.
Budget 2025: సాధారణంగా బడ్జెట్‌ను ఎక్కువుగా ఫిబ్రవరి 28వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుండేది. మార్చి నుంచి కొత్త ఆర్థిక సంవత్సం ప్రారంభం కావడంతో ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ పెట్టడం సాంపద్రాయంగా మారింది. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఈ సంప్రదాయంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
Droupadi Murmu: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీదే ఇప్పుడు అందరి ఫోకస్ నెలకొంది. ఏయే శాఖకు కేటాయింపులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు.
భారతదేశ చరిత్రలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మోరార్జీ దేశాయ్ నిలిచారు. ఆయన ఫిబ్రవరి 28, 1959న తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1960, 1961,1962, 1963, 1964లో సమర్పించారు. అనంతరం 1967 మధ్యంతర, 1967, 1968, 1969 పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు.
Budget 2025: కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
గత పదేళ్లలో కొత్తగా 1.01 లక్షల మెడికల్ సీట్లు పెంచినట్లు, అలాగే రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల సీట్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు.
ప్రస్తుతం బీహార్‌లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్లబోతున్న బీహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు.
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో AI (Artificial intelligence) కు పెద్ద పీట వేశారు. దీంతో పాటూ ఆనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఆ విషయాలు మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు.
Nirmala Sitharaman: బడ్జెట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్టప్ ఔత్సాహికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వాళ్లకు సూపర్ న్యూస్ చెప్పింది.