Home » BRS Chief KCR
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన తెలంగాణ జాగృతి సంస్థ పెద్ద అవినీతి సంస్థ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవటానికే కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తోందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.
బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్ ను ఆపాలని హరీష్‌రావు సవాల్ విసిరారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ రైతుబంధు వేస్తామన్నారని.. ఇప్పటికీ ఇంకా రైతులందరికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వట్లేదని మాజీమంత్రి హరీష్‌రావు నిలదీశారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని హరీష్‌రావు అన్నారు.
తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా.. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని మాజీమంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని అన్నోళ్లకి పండిన పంట తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు పారుతున్నాయని తెలిపారు.
రేవంత్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ రోజు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్‌పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో. కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని కిషన్‌రెడ్డి అన్నారు.