Home » Bonda Umamaheswara Rao
జిల్లాలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వార్డ్ మెంబర్ భర్త దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.టీడీపీ కార్యకర్తలు ఇంటిపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆధారాలను బయట పెట్టారు.
గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు కూడా ఏపీలోనే దొరికాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ మత్తు పదార్ధాలు దొరికినా దానికి ఏపీనే అడ్రస్‌గా ఉంటోందని చెప్పారు.
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
విజయవాడ: బీసీ హక్కులను పరిరక్షించాలని, నాగ వంశీ సాధికారిత కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు.
టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
Andhrapradesh: వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రజాసేవకులని, వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.
వైసీపీ నేత కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ఆస్తులు.. అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని.. అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు.
సీఎం జగన్ తన ఓటమిని ఒప్పుకున్నాడని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు (Bonda Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, వైసీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి, సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీశాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.