Home » BJP
గెలుపు పక్కా అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌కు రాఘోపూర్‌లో బీజేపీ నేత సతీశ్ కుమార్ యాదవ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. మొదట్లో సతీశ్ ఆధిక్యంలోకి రావడం ఆర్‌జేడీ వర్గాలను కాస్త టెన్షన్ పెట్టింది. అయితే, చివరకు తేజస్వీ 14 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొడుతోంది. అదే సమయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. నితీష్ కుమార్, ఎల్‌జేపీ ముందు ఆర్జేడీ పూర్తి స్థాయిలో డీలాపడింది.
బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందని, నగ్రోటాతో పాటు బిహార్ ఎన్నికల్లో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని గెలుపు అనంతరం దేవయాని రాణా వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్‌కు తాము గట్టి పోటీ ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్‌కి 38 శాతం పైగా ఓటింగ్ వచ్చిందని వివరించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు నిబంధనలని తుంగలో తొక్కారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.
ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మా డాడీ అని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ పేర్కొన్నారు. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గ అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఉదయం మాజీమంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ప్రారంభించారు.
గడిచిన నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో కపట నాటకాలాడుతున్న దుష్టశక్తుల పాలనకు చరమగీతం పాడనున్నామని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశక్తి విలువ తెలియజేస్తామని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేత విజయ్ ధ్వజమెత్తారు.
ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.