Home » BJP
జిల్లా నుంచి కరువును తరిమి కొడతానని, ఇది సీబీఎన మాట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా ప్రజలకు అధికారికంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశానని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. రాయలసీమను ఎనర్జీ సిటీ చేస్తానని ప్రకటించారు. కియ పరిశ్రమతో అనంతకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చానని అన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయని పనిని వంద రోజుల్లో పూర్తి చేశామని
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. పార్టీపరంగా రెండు మహానాడులు నిర్వహించి జనసమీకరణ చేసినంత మాత్రాన ఆ జనం టీవీకేకు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని, జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు.
చారిత్రక ఘట్టానికి అనంతపురం సిద్ధమైంది. పది రోజుల వ్యవధిలో ఏకంగా 3.50 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటకు చేర్చే మహాయజ్ఞం పూర్తి అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మూడు పార్టీల నాయకులు నగరంలో తిష్ట వేసి.. చక చకా ఏర్పాట్లు చేయించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలలో చాటిన ఐక్యతను హామీల అమలులో కొసాగించారు. కేవలం 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను అమలు చేసి.. సగర్వంగా జనం ఎదుటకు వస్తున్నారు అగ్ర నాయకులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ...
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే గెలుపు సొంతమైంది. ఈ మేరకు భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇండీ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన బి.సుదర్శన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, 97 శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి అని తాను చెప్పలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా పాళయంకోటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది జాతీయ పార్టీ అని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి 210 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై జీవో ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ జీవోకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఎట్టకేలకు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించారు.