Home » BJP Candidates
విదేశాల్లోని అదానీ గ్రూప్‌లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి కారణమైంది! ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్త పార్లమెంటు భవనం పైకప్పు లీకవుతోంది. రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనం లాబీలోని గాజు పైకప్పు నుంచి కింద ఉచిన బకెట్‌లోకి నీరు ధారగా పడుతున్న వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్...
రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఎంపీ కె.లక్ష్మణ్‌ను నియమిస్తున్నట్లు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించపోవడానికి కారణాలను సమీక్షించుకుని, భవిష్యత్‌లో ఓటమి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. డిసెంబరు నెలాఖరులోపు కొత్త సారథి ఎన్నిక పూర్తికానుంది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయింది.
అమృత్ పథకం పనులకు సంబంధించి పిలిచిన టెండర్లను వారం రోజుల్లో రద్దు చేసి, గ్లోబల్ టెండర్లను పిలవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
దివంగత మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు సమీపంలోని రాథోడ్ రమేశ్ వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్(59) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.