Home » Bihar
భారతీయ జనతా పార్టీకి వరుసగా రెండో వారం కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం మరవకముందే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది.
బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.
బిహార్‌లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఇవాళ (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు.
బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఉద్రిక్తత నెలకొంది. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఈ ఉపఎన్నికలో తొలిసారి ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ప్రశాంత్ కిశోర్ స్థానిక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన వదిన తలను గొడ్డలితో నరికేశాడు.
నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది.
రెండు రోజుల క్రితం 'బిహార్ బంద్' సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై ఓ పోలీసు 'ఏకే-47' తో కాల్పులు జరపడంపై అధికారులు సీరియస్ అయ్యారు.
జన శక్తి జనతా దళ్ (జేఎస్జేడీ) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌కు జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్ అంశంపై శనివారం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్దగా ప్రస్తావనకు రాని రాష్ట్రం బిహార్.. ఇప్పుడు యువ క్రికెటర్లకు చిరునామాగా మారుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ వేదికపై రికార్డులతో మెరిసిపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ పేసర్ వాసుదేవ్ ప్రసాద్ వెలుగులోకి వచ్చాడు.
దోపిడీతో పాటు మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఓ ముఠా బిహార్‌లోని దర్భంగా జిల్లా దర్హార్ గ్రామ ప్రజలను భయపెడుతోంది. వరుసగా చోరీలు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్న ఆ దొంగల ముఠా సభ్యులు.. మహిళల జుట్టు కత్తిరిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.