• Home » Bhuvanagiri

Bhuvanagiri

Hyderabad: ‘విద్యుత్‌ విచారణ’  షురూ!

Hyderabad: ‘విద్యుత్‌ విచారణ’ షురూ!

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణ పనులను నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టడం, అవసరం లేకున్నా ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకోవడం వంటి కారణాలతో జరిగిన నష్టంపై 10 రోజుల్లోగా (ఈ నెల 16 నుంచి) ఫిర్యాదు చేయాలని జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి కమిషన్‌ కోరింది. ఈ మేరకు గురువారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. పోటీ బిడ్డింగ్‌ ద్వారా కాకుండా నామినేషన్‌ ప్రాతిపదికన ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం చేసుకోవడం, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ప్లాంట్లు కడుతుండగా..

Yadadri: కీలక దశకు యాదాద్రి పవర్‌ ప్లాంట్‌

Yadadri: కీలక దశకు యాదాద్రి పవర్‌ ప్లాంట్‌

ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ విద్యుదుత్పత్తికి సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్‌) మంగళవారం విజయవంతంగా పూర్తయింది. దీంతో జెన్‌కో అధికారులు అక్టోబర్‌ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్లాంటు వద్దే సమీక్ష నిర్వహించి అక్టోబర్‌ నాటికి మొదటి రెండు యూనిట్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి జెన్‌కో యంత్రాంగం పనులను వేగంగా కొనసాగిస్తోంది.

TG: యాదగిరికొండపై వారాంతపు రద్దీ..

TG: యాదగిరికొండపై వారాంతపు రద్దీ..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. దాదాపు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.

నాయకా.. నెమ్మది!

నాయకా.. నెమ్మది!

నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాయి.

TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.

నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడలేదు: కేసీఆర్

నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడలేదు: కేసీఆర్

భువనగిరి: కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాష్’ అని అన్నారని మరి అభివృద్ధి ఏదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

Lok Sabha Polls: కాంగ్రెస్‌ కోటపై కమలం కన్ను

Lok Sabha Polls: కాంగ్రెస్‌ కోటపై కమలం కన్ను

ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..

TG News:హై కమాండ్ నాకు ఆ హామీ ఇచ్చింది..  ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

TG News:హై కమాండ్ నాకు ఆ హామీ ఇచ్చింది.. ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.

Yadadri: యాదాద్రి  లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో  9వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు

Yadadri: యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో 9వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

Yadadri: యాదాద్రి భక్తులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన అధికారులు..

Yadadri: యాదాద్రి భక్తులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన అధికారులు..

యాదాద్రి: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్‌ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి