Home » Bhupesh Bhagel
కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారంనాడు పటాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇదే సీటు నుంచి ఆయన ఐదుసార్లు 1993, 1998, 2003, 2013, 2018లో గెలుపొందారు. 2008లో మాత్రం బీజేపీ అభ్యర్థి, తన మేనల్లుడు విజయ్ బఘెల్ చేతిలో ఓటమి చవిచూశారు.
ఒక హామీ బీజేపీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు 2018 ఎన్నికల్లో పట్టంగట్టింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇప్పుడు మళ్లీ అదే పాచిక బయటకు తీశారు. ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన సోమవారంనాడు వాగ్దానం చేశారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చత్తీస్‌గఢ్ కాంగ్రెస్అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారంనాడు తెలిపారు.
ఎన్నికలకు సంబంధించిన పార్టీ సమావేశంలో 'క్యాండీ క్రష్' ఆన్ లైన్ గేమ్ ఆడుతున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ ఫోటోను బీజేపీ విడుదల చేయడం, దానిపై విమర్శలు గుప్పించడాన్ని సీఎం అంతే ధీటుగా బుధవారంనాడు తిప్పికొట్టారు. ''నా ఉనికే వారికి అభ్యంతరంగా ఉన్నట్టు ఉంది'' అంటూ ఛలోక్తి విసిరారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ జకీయ సలహాదారు వినోద్ వర్మ, రాయపూర్ ఓఎస్‌డీ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు దాడులు జరిపింది. ఈ ఇద్దరి నివాసాలపై ఈడీ బృందాలను దాడులకు పంపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను ముఖ్యమంత్రి తప్పుపట్టారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోమవారం మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా ఓ పాము కలకలం సృష్టించింది. సీఎం కాలిపక్కనుంచి పాము వెళ్తుండగా ఆయన భద్రతా సిబ్బంది సహా అక్కడున్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దానిని కొట్టి చంపేందుకు వారు ప్రయత్నంచగా సీఎం వారించారు.
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉన్నారని ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్ శాఖ అధ్యక్షుడు అరుణ్ సావో (Arun Sao) చెప్పారు. రాష్ట్రంలోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవినీతి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదన్నారు. భయపడేవాడు మోదీయే కాదన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఛత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయబోనని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దంతెవాడ జిల్లా (Dantewada district) అరణ్‌పూర్‌లో (Aranpur) నక్సలైట్లు (naxals) ఘాతుకానికి పాల్పడ్డారు.
ఈ ఏడాదిలో జరిగే ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు (Chhattisgarh assembly polls)లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉన్నట్లు