Home » Bhupathiraju Srinivasa Varma
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రకటించిన రూ. 11,400 కోట్ల ప్యాకేజీని త్వరితగతిన అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ ప్యాకేజీ ప్రకటన తర్వాత, విశాఖ పాంట్లో ఉత్పత్తి పెరగడమే గాక, అనేక మార్పులు వచ్చినట్లు తెలిపారు.
Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.
Srinivasa Varma: కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. కాంగ్రెస్ హయంలో రూ 12 లక్షలు ఆదాయం ఉంటే రూ. 2 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.
Srinivasa Varma: స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయని... వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో సాయం చేస్తున్నారని అన్నారు. సిల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండాలని మోదీ భావిస్తున్నారని చెప్పారు.
Minister Nara Lokesh: విద్యాశాఖ చాలా కష్టమైన శాఖ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కష్టమైన శాఖలను ఎంచుకోవడం తనకు ఇష్టమన్నారు. కష్టకాలంలో మనతో నిలబడిన వారితో కలిసి వెళ్లాలని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను మార్చాలని భావిస్తున్నామని అన్నారు.
Union Minister Bhupatiraju Srinivasa Varma: వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా నోచుకోలేదని కేంద్ర పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు తరలిపోయాయని చెప్పారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రామాయణపట్నం , అనకాపల్లితో పాటు మరికొన్ని పరిశ్రమలును ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.
అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వివరించారు. ధాన్యం బకాయిలు వైసీపీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కూటమి ప్రభుత్వం రూ. 1600 కోట్ల రైతు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. ఆధునిక టెక్నాలజీ డ్రోన్ ద్వారా పంటలకు పురుగు మందులు పిచికారీ చేసే విధానంతో మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రైతు భరోసా చెల్లిస్తున్నాయని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీని బడే బాయ్ అంటూ సంబోధించడం ద్వారా సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీపై పరోక్షంగా ప్రశంసలు కురిపించారు.
భీమవరానికి చేపలు, రొయ్యల పరిశ్రమ కారణంగా దేశంలో గుర్తింపు వచ్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వాడటం వల్ల క్వాలిటీ దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. శనివారం నాడు మంత్రి భూపతిరాజు భీమవరంలో పర్యటించారు.