Home » Bhatti Vikramarka
లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూసిన జాబ్ క్యాలెండర్‌ను ఎట్టకేలకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం విడుదల చేసింది.
చివరిరోజైన శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జాబ్ క్యాలెండర్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటన అనంతరం.. జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభాపతిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరగా తిరస్కరించారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించిన సర్పంచులను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
యువతకు కేవలం సర్టిఫికెట్లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకడం కష్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏనాడూ తన సామాజిక వర్గం పేరు చెప్పుకోలేదు.. వాడుకోలేదు.
తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నిరసన తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్ట మొదటిసారిగా దాదాపుగా 17 గంటల పాటు ఏక ధాటిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సోమవారం ఉదయం10 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ వాడి వేడిగా జరిగి ముగిసింది.
గత పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుందని, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును, ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆరోపించారు. మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే హైటెక్ సిటీని కూడా అమ్మేసేదని అన్నారు.
లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) పెండింగ్ దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనుంది. దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాకో బృందాన్ని ప్రత్యేకంగా నియమించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 బృందాలు ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్ దరఖాస్తులను పరిశీలించనున్నాయి.