Home » Bhatti Vikramarka
Telangana: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత గురుకులాలకు అవసరమైన భూములను సేకరించాలని, త్వరితగతిన డిజైన్లను పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ఈ నేపథ్యంలో బ్యాటరీల కోసం వినియోగించే లిథియంతోపాటు ఇతర మూలకాల అన్వేషణ, వెలికితీతపై సింగరేణి దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు.
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు నేడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించనున్నారు. పది రోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
Telangana: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, ఖమం ఎంపీ రఘురాంరెడ్డి ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.