Home » Bhatti Vikramarka
వరదలతో దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రెండు తెలుగు రాష్ట్రాలను వరదలతో ముంచెత్తుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 9మందికి పైగా వరదల్లో చిక్కుకుని మృతిచెందగా.. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. అయితే రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.
‘‘మాది ఫ్యూడల్ గవర్నమెంట్ కాదు.. పీపుల్స్ గవర్నమెంట్.. మీలాగా ఇళ్లల్లో పడుకోవడం లేదు.. ప్రతీరోజు ప్రజల్లోనే ఉంటున్నాం.. నువ్వు, నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని దోచుకుని విదేశాల్లో దాచుకున్నారు.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భద్రత కల్పించే విషయంలో పోలీసుశాఖకు అవసరమైన పూర్తి స్తాయి నిధులను కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana: హైదరాబాద్‌ను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్టంలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయన్నారు. 1500 ఏజెన్సీలు పనిచెయ్యడం సంతోషమన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలు అనేక మందికి ఉపాధి కల్పించడం సంతోషమన్నారు.
చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలనే ‘హైడ్రా’ కూల్చివేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలోని 25 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్ అవేలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి నిధులను విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు
సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాల రీస్ట్రక్చరింగ్‌కు సహకరించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
Telangana: హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ...హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.