Home » Bhatti Vikramarka
ఝార్ఖండ్ వనరులను తమకు కావాల్సిన కొద్దిమంది పెట్టుబడిదారుల చేతిలో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున.. ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Telangana: హౌస్ లిస్టింగ్ పూర్తి చేసి ఈరోజు (శనివారం) నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోందని.. ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయన్నారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వం చేపట్టిన కులగణన... రేషన్ కార్డులనో, పథకాల లబ్ధిదారులను తగ్గించడానికో కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సర్వే జరగొద్దని కొంతమంది కుట్ర చేస్తున్నారని, అందుకే అపోహలు సృష్టిస్తున్నారని పరోక్షంగా బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపించారు.
భవన నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసే క్రమంలో హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కులగణన.. దేశానికే ఒక నమూనా కానుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇక్కడ చేపట్టే కులగణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే.. దేశ వ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరి చేసుకుంటామని చెప్పారు.
రాష్ట్ర సంపద ప్రజలకు ఉపయోగపడాలి కానీ, పాలకులు పంచుకోవడానికి కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రంతో పాటుగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఝార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఝార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు.