Home » Bhatti Vikramarka Mallu
ఫోన్ ట్యాపింగ్‌పై మరో సారి దుమారం రేగింది. ముగ్గురు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క, ఉత్తమ్, పొంగులేటి ఖండించారు.
రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే లింగ వివక్ష దూరమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని, భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విద్యుత్ అధికారులను ఆదేశించారు.
ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేని తనకు ప్రజా ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావడంతో ఓ వృద్ధురాలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉండి తప్పు మీద తప్పు చేసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి భారంగా మారాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.
తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తి సంతృప్తిగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి కల్పన, సంపదసృష్టి తదితర అంశాల్లో పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సర్కారు ముందు ప్రైవేటు కాలేజీల యాజమా న్యాలు కొత్త ప్రతిపాదన ఉంచాయి.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తీసుకున్న జై బాపూ, జై భీమ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ కమిటీల అధ్యక్షుల సమ్మేళనం జరగనుంది.