Home » Bhadradri Kothagudem
భద్రాద్రి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మరోమారు ఎరుపెక్కింది. కరకగూడెం మండల పరిధిలో రఘునాఽథపాలెం పంచాయతీ మోతె గ్రామ సమీపంలో బోనాలకుంట అడవిలో తుపాకీ తూటా పేలింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం 45.5అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
మావోయిస్టు పార్టీలో గత ఆరేళ్లుగా పని చేస్తున్న బంటి రాధ (25) అలియాస్ నీల్సో అనే మహిళా మావోయిస్టు (కమాండర్)ను బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు హత్య చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు మాట్లాడడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
సీతారామ ప్రాజెక్ట్‌పై మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీశ్ రావు బోగస్ మాటలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Recanth Reddy) ఆక్షేపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగూడెంలోని సీతారామ ప్రాజెక్టుని మంత్రుల సమక్షంలో ఆయన ప్రారంభించారు.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు.
Telangana: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్‌ను రేపు (ఆగస్టు 15) ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు.
కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.