Home » Betting apps
ఆన్‌లైన్ రమ్మీ ఆటలో ఒకరు రూ.1.4 కోట్లు కోల్పోయాడు. గేమింగ్ వ్యసనంతో బాధపడుతూ పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై చర్యలకు ఉపక్రమించిన పోలీసులు యాప్ నిర్వహకులపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రతిరోజు కొత్త యాప్‌లు ఎందుకు పుట్టుకొస్తున్నాయి. లీగల్ పేరుతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నవారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.
మెట్రో రైళ్లు, స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులపై అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ప్రదర్శన, ప్రచారం నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ సనత్‌నగర్ సమీపంలో జరిగింది.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరొకరు బలయ్యారు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహదేవ్ యాప్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
బెట్టింగ్ భూతం.. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎందరినో బలి తీసుకుంటుంది. బెట్టింగ్ యాప్‌లకు బానిసలుగా మారి.. అప్పుల పాలై.. చివరకు వాటిని తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడి.. బెట్టింగ్ యాప్‌లు చేసే మాయలో చిక్కుకుని సర్వం పోగొట్టుకుని ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు పెరగడంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌పై ఉక్కుపాదం మొపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
అప్పు చేసి ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్ పెట్టిన ఓ యువకుడు వాటిలో నష్టపోయి వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం జరిగింది.