Home » Bathukamma
Telangana: బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అంటూ వివిధ రకాల పాటలు పాడుతూ లయద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడి పాడుతుంటారు. ఇక ఈరోజు జరుపుకునే బతుకమ్మ పేరు వెన్నముద్దల బతుకమ్మ. వెన్న ముద్దల బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది... ఈ రోజు నైవేద్యంగా ఏం సమర్పిస్తారు..
బతుకమ్మ ఉత్సవాలు మంగళవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు నేటితో ముగిశాయి. అందులోభాగంగా మంగళవారం సద్దుల బతుకమ్మను నిమ్మజ్జనం చేశారు. అందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరీ మాత అమ్మవారిని బతుకమ్మ ఘాట్ వరకు మున్సిపల్ పాలకవర్గం ఊరేగింపుగా తీసుకు వెళ్లింది.
Telangana: సకినాలకు ఉపయోగించి పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో ముద్దలుగా తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా బెల్లం, పప్పును కూడా నైవేద్యంగా పెడతారు. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు వరుసలతో త్రికోణంలో తయారు చేస్తారు.
Telangana: ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు.
బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు.
ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని తెలిపారు.
బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది.
Telangana: ఆశ్వయుజ శుద్ధ తదియనాడు నానే బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. రెండో రోజు రెండు వరుసలు, మూడో రోజు మూడు వరుసలతో బతుకమ్మను పేర్చిన మహిళలు నాలుగో రోజు అంటే నానే బియ్యం బతుకమ్మ రోజున నాలుగు వరుసలతో బతుకమ్మను త్రికోణంలో పేర్చుతారు.