• Home » Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar

 Piyush Goyal : పసుపు బోర్డుతో కలిగే లాభాలు చెప్పిన కేంద్రమంత్రి

Piyush Goyal : పసుపు బోర్డుతో కలిగే లాభాలు చెప్పిన కేంద్రమంత్రి

Union Minister Piyush Goyal: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు.ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు.

BANDI SANJAY: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

BANDI SANJAY: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

BANDI SANJAY: కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు.. వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చని చెప్పారు. 14 శాతం కమిషన్ మీదే ప్రభుత్వం బతుకుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు మంత్రుల బండారం బయట పెడుతామని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.

BANDI SANJAY: రేవంత్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టిన బండి సంజయ్.. ఎందుకంటే..

BANDI SANJAY: రేవంత్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టిన బండి సంజయ్.. ఎందుకంటే..

BANDI SANJAY: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..

Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.

Minister Seethakka: బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి.. మంత్రి సీతక్క భావోద్వేగం

Minister Seethakka: బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు బాధించాయి.. మంత్రి సీతక్క భావోద్వేగం

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్‌లో లాయర్‌గా పనిచేశానని గుర్తుచేశారు. తాను మూడు సార్లు ప్రజా ప్రతినిదిగా పనిచేశానని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్‌ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలని అన్నారు.

Bandi Sanjay:  సుప్రీంకోర్టు తీర్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..

Bandi Sanjay: సుప్రీంకోర్టు తీర్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..

‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ఫలితమే నేటి సుప్రీంకోర్టు తీర్పు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Bandi Sanjay: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు: తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు: తెలంగాణ కాంగ్రెస్‌పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టిన గతే తెలంగాణ కాంగ్రెస్‌కు పడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Bandi Sanjay : తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay : తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయని విమర్శలు చేశారు.

TG Politics: అమరవీరుల స్తూపం వద్దకు వస్తారా? గంగాపురం, బండికి పొన్నం సవాల్

TG Politics: అమరవీరుల స్తూపం వద్దకు వస్తారా? గంగాపురం, బండికి పొన్నం సవాల్

మోదీ కేబినెట్‌లోని మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూర్చలేదన్నారు. వారిలో తెలంగాణ డీఎన్‌ఏ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం చాలా చేసిందంటూ చెబుతున్న కేంద్ర మంత్రులు ఇద్దరికీ ఈ సందర్బంగా బహిరంగ సవాల్ విసిరారు. అందుకోసం అమర వీరు స్తూపం వద్ద చర్చకు వస్తారా? అంటూ కేంద్ర మంత్రులకు ఈ సందర్భ:గా మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

Bandi Sanjay: దీపావళి దాటింది.. రాజకీయ బాంబులు పేల్చలేదేం

Bandi Sanjay: దీపావళి దాటింది.. రాజకీయ బాంబులు పేల్చలేదేం

‘‘దీపావళి తర్వాత రాజకీయ బాంబులు పేలుతాయని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. పండుగ దాటినా ఎలాంటి బాంబులు పేలలేదు. కాంగ్రె్‌సవి ఉత్తరకుమార ప్రగల్భాలే’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి