Home » Ballari
తుంగభద్ర జలాశయానికి(Tungabhadra reservoir) మళ్లీ వరద పోటెత్తుతోంది. దీంతో 33 క్రస్ట్‌గేట్లు (25 గేట్లు మూడు అడుగులు, మరో 8 గేట్లు ఒక్క అడుగు మేర)ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 1,23,381 క్యూసెక్కు ల నీటిని తుంగభద్ర నదికి, 9379 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ వరదనీరు వచ్చి జలాశయంలోకి చేరుతున్నాయి.
సెంట్రల్ రైల్వేలోని డౌండ్ వద్ద జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా గుంతకల్లు(Guntakal) మీదగా వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముంబై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్(Mumbai-Bangalore Express) (నెం. 11301)ను ఈనెల 29వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 11302)ను ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకూ, అలాగే కన్యాకుమారి-పూనా(Kanyakumari-Poona) ఎక్స్‌ప్రెస్ (నెం. 16382)ను ఈ నెల 28, 29 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16381)ని ఈనెల 30, ఆగస్టు 1వ తేదీన పూనే, మీరజ్, కురుద్వాడి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలియజేశారు.
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్‌ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది.
తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మే ఆఖరి, జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. కాని తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వరద నీరు చేరలేదు.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర(Tungabhadra) ఇప్పుడిప్పుడే జల కళ సంతరించుకుంటోంది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
మళ్లీ వేసవి వచ్చింది.. ఎండలూ వచ్చాయి.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. బయటికెళ్తే ఎండవేడిమి.. పదేపదే నీటికోసం ఆగని దాహం కాసిన్ని చల్లటి నీళ్లు దొరికితే ఆ ఆనందమే వేరు.. అదే.. కొత్త కుండలోని నీరైతే.. గటగటా తాగేస్తాం..
ఇండియాలో ఉంటూ.. ఇక్కడి గాలి పీలుస్తూ.. పాకిస్తాన్ జిందాబాద్ అనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుసేన్ కు సిగ్గుగా లేదా అని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu) ప్రశ్నించారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని పేదల అభ్యున్నత కోసమే స్థాపించారని, అప్పటికి ఇప్పటికి పార్టీ పేదలకు గొడుగులా నీడనిస్తోందని కమ్మసంఘం జిల్లా కార్యదర్శి దామోదర్ చౌదరి, కమ్మనాయకుడు ఎస్.వెంకటనాయుడు అన్నారు.