Home » Ballari
టమోటా(Tomato) రైతులకు కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు పంటలు కోసేందుకు కూడా వెనకాడు తున్నారు. కాయలను తెంచడానికి కూలీలకు అయ్యే ఖర్చు కూడా తిరిగి రాదని పొలాల్లోనే పంటను వదిలేసున్నాడు.
ఉల్లి(Onions) ధరలు పరుగులు పెడుతున్నాయి. స్థానికంగా పండించే చిన్న రకం ఉల్లి ధర అమాంతం పెరిగింది. నిన్న, మెన్నటి దాకా రూ.70 ఉన్న కేజీ ధర శుక్రవారం కిలో రూ.100 పలికింది.
రెండు నెలల క్రితం కిలో రూ.50..60 పలికిన టమోటా(Tomato) ధర... అమాంతం పడిపోవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన టమోటాకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్ళలేక చెత్తకుప్పలో పడేసిన దృశ్యం బళ్ళారి ఏపీఎంసి మార్కెట్(Bellary APMC Market)లో గురువారం చోటు చేసుకుంది.
కొప్పళ జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర నది(Tungabhadra River) రోజు రోజుకూ కలుషితమవుతోంది. సాగు, తాగు నీరందించే నది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో నిండిపోతోంది.
వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్‌లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
బీపీఎల్(బిలో పావర్టీ లైన్) రేషన్ కార్డుల(Ration cards) ఏరివేతలో భాగంగా బళ్లారి, విజయనగర జిల్లాల్లో అనర్హులుగా గుర్తించి 14,082 మంది కార్డులు రద్దు చేశారు. బళ్లారి జిల్లాలో మొత్తం 12,950 మంది అనర్హులు బీపీఎల్ కార్డులు పొందినట్లు గుర్తించి, రద్దు చేసినట్లు ఆహార పౌరసరఫరా అధికారులు తెలిపారు.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీ పంటలో కూడా దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఆ గ్రామంలో ఎవరైనా మృతిచెందితే... అంత్యక్రియల కోసం వాగు దాటాల్సిందే. జి.నాగలాపురం(G. Nagalapuram) గ్రామ ప్రజల కష్టాలు ఈ నాటివి కావు.. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా వారి సమస్యలను పరిష్కరించిన నాథుడు లేడు. గ్రామ శివారులో శ్మశాన వాటిక ఉండడంతో వర్షాకాలంలో వారి కష్టాలు మరింత దయనీయంగా మారుతున్నాయి.
రేణుకాస్వామి హత్యకేసులో ఏ-2 నిందితుగా ఉంటూ బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నడ హీరో దర్శన్(Hero Darshan) బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలను సాయంత్రం 5 గంటలకు న్యాయవాది జైలర్(Jailer)కు అందజేశారు. పరిశీలించిన ఆయన దర్శన్‌ను విడుదల చేశారు.
కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా మరగుబ్బి గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన కేసులో దోషులకు సెషన్స్ కోర్టు శిక్షలను ఖరారు చేసింది.