• Home » Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

Janasena: బాలినేని శ్రీనివాస‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.

AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై

AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై

మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

Balineni :  వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదు: బాలినేని

Balineni : వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదు: బాలినేని

జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు.

YCP: వైసీపీకి బాలినేని రాజీనామా

YCP: వైసీపీకి బాలినేని రాజీనామా

వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు.

YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు

YS Jagan: బాలినేని శ్రీనివాసరెడ్డితో విడదల రజినీ చర్చలు

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ వీడేందుకు దాదాపుగా సిద్దమైనట్లు సమాచారం. అందులోభాగంగా ఒంగోలులోని తన వైసీపీ కార్పొరేటర్లు, తన ముఖ్య అనుచరులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ వీడకుండా బాలినేని ఉండేందుకు మాజీ మంత్రి విడదల రజినీని మాజీ సీఎం వైఎస్ జగన్ రంగంలోకి దింపారు.

Balineni Srinivasa Reddy : జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు

Balineni Srinivasa Reddy : జిల్లా అధ్యక్ష పదవి నాకొద్దు

ఓటమి భారంతో ఆపసోపాలు పడుతున్న ప్రకాశం జిల్లా వైసీపీలో సరికొత్త సంక్షోభం ఏర్పడింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు పార్టీలో పదవులొద్దని.. అసలే పనీ చేయలేనని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కే తేల్చిచెప్పారు.

AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..

AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..

వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. తానే పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నానని అన్నారు. తనను పార్టీ పట్టించుకోకపోవడమే..

Balineni Srinivas: త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా.. బాలినేనిశ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Balineni Srinivas: త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా.. బాలినేనిశ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డా.. కొంతమంది బయటి వ్యక్తులతో కలసి మా వాళ్లే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు. త్వరలో అన్నీ విషయాలు బయట పెడతా’’ అని అన్నారు.

Balineni Vs Damacharla: కౌంటింగ్ రోజు పారిపోయి ఇప్పుడొచ్చి నీతులా..?

Balineni Vs Damacharla: కౌంటింగ్ రోజు పారిపోయి ఇప్పుడొచ్చి నీతులా..?

వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మానసికంగా బ్యాలెన్స్ తప్పారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు(MLA Janardhana Rao) అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బాలినేని, ఆయన కొడుకు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావని మండిపడ్డారు. శ్రీనివాసరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి