Home » Bail
విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.
జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులకు విజయవాడ కోర్టు బెయిల్ నిరాకరించింది. మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్‌పై తీర్పు ఈ నెల 13కి వాయిదా వేసింది
మద్యం స్కాంలో ప్రధాన నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పల ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు తిరస్కరించింది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు అవసరమని పేర్కొంటూ కస్టడీలో విచారణకు వీలుగా తీర్పునిచ్చింది.
అనంతపురంలో బోరుగడ్డ అనిల్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించిన కేసులో బెయిల్ మంజూరైంది. అనంతపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి
విడదల గోపి బెయిల్ మంజూరును కోరుతూ ఆయన న్యాయవాది ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు విచారణను నేటి (మంగళవారం)కి వాయిదా వేసింది
అరెస్టు సమయంలో నిందితుడికి కారణాలు చెప్పకపోతే బెయిల్ మంజూరు చేయవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం కారణాలు చెప్పడం తప్పనిసరి అని పేర్కొంది
తాను బెయిల్ నిబంధనలు ఉల్లంఘించలేదు, అలాగే.. మంత్రి పదవిలో కూడా కొనసాగే హక్కు నాకుందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు. అలాగే.. ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కామ్రాకు మార్చి 31న ముంబై పోలీసులు సమ్లన్లు పంపారు. దీనికి ముందు కూడా ఆయనకు పోలీసులు సమన్లు పంపగా వారం రోజులు గడువు ఇవ్వాలని కామ్రా కోరారు. అయితే అందుకు నిరాకరించిన పోలీసులు రెండోసారి సమన్లు పంపారు.
ఏప్రిల్ 4వ తేదీ వరకూ లోక్‌సభ సమావేశాలు ఉన్నందున వాటికి హాజరయ్యేందుకు కస్టడీ పెరోల్ కానీ, తాత్కాలిక బెయిల్ కానీ మంజూరు చేయాలని విచారణ కోర్టును ఇటీవల రషీద్ కోరారు. అయితే అతని అభ్యర్థను కోర్టు మార్చి 10న కొట్టివేసింది.
మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యారావును డీఐర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.12.56 కోట్ల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది.