Home » Ayodhya Sriram
నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఆ క్రమంలో అందుకు సంబంధంచిన వీడియోలను ఆ యా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై వారంతా విమర్శలు గుప్పించారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి బీజేపీ లక్ష్యంగా చేసుకొని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఓటమిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు.
అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇండియా డే పరేడ్‌లో(India Day Parade in New York) భాగంగా ఏటా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్‌లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆగస్టు 18న జరిగే ఇండియా డే పరేడ్‌లో అయోధ్యలోని రామ మందిర రూపం న్యూయార్క్ వీధుల్లో ప్రదర్శితం అవుతుంది.
2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్‌లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే..
అయోధ్యలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు.. ఆర్నెల్లయినా కాకముందే.. కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతోంది! శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.
బీజేపీ సర్కార్ 2024 జనవరి 22న ఎంతో అట్టహసంగా ప్రారంభించిన అయోధ్య రాముడి ఆలయ(Ayodhya Ram Mandir) గర్భ గుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరాయి. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం విమర్శలకు తావిస్తోంది.
అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం తుదిశ్వాస విడిచారు.