Home » Ayodhya Ram mandir
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన 'రామరక్ష' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ స్పందించారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనన్నారు.
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని విచారణ అధికారులు (SIT) స్వాధీనం చేసుకున్నారు.
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక అంచనా ప్రకారం, భక్తులు సమర్పించిన నగదు నుంచి రోజుకు సుమారు రూ.6-8 లక్షలను నిందితులు కాజేసినట్టునట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయోధ్యలోని రామ మందిర విరాళాల దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతోంది. ఈ కేసులో మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించింది.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
అయోధ్య విరాళాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల తరఫున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని నిర్ణయించింది. బార్ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు.
అయోధ్య వివాదంలో చర్చల మార్గాన్ని సమర్థించిన మౌలనా సల్మాన్ నద్వీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసుపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు అత్యవసర విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సెలవుల తర్వాత కేసును రెగ్యులర్ బెంచ్ ముందు విచారణకు ఉంచాలని ఆదేశించింది.