Home » AV Ranganath
భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది.
మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు.
గురువారం హైదరాబాద్‌లో హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ వీ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరించనున్నామన్నారు.
మహానగరంలో చెరువులు, నాలాల లెక్కను శాస్త్రీయ విధానం ద్వారా తేల్చేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) సన్నద్ధమైంది.
మహా నగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలపై నిరంతర నిఘాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) చర్యలు తీసుకుంటోంది.
మధురానగర్ కాలనీ మధురమైన కాలనీ కింద ఉండేది ఒకప్పుడు,పద్ధతి ప్రకారం కాలనీ అంటే ఇలా ఉండాలి అనేలా ఉండేది.. ఇప్పుడు ఏ వీధి చూసినా కమర్షియ ల్ కింద అయిపోయిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు.
మూసీకి ఇరువైపులా చేసిన సర్వే, మార్కింగ్‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను తరలించడం లేదని, నది సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చేపడుతున్నదని పేర్కొన్నారు.