Home » Australia
David Warner Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నూతన సంవత్సరం రోజున అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు.
క్రికెట్ మ్యాచులో భాగంగా అప్పుడప్పుడు సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలో విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో సహా సోషల్ మీడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆటగాడి డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.
AUS Vs PAK: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పావురాల వల్ల ఆటకు అంతరాయం కలిగింది. మైదానంలో పావురాలు వచ్చి ఉండటంతో వాటిని బయటకు పంపించడానికి లబుషేన్ తీవ్రంగా కష్టపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు క్రిస్మస్ గిఫ్టులు అందించడం స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా పాల్గొన్నాడు.
Year End 2023: క్రికెట్‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఎంతో కలిసొచ్చిందనే చెప్పాలి. టెస్టుల్లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డేల్లో ఐసీసీ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో 2023 ఆస్ట్రేలియాకు మరపురాని సంవత్సరంగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
కొందరు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే చాలు.. చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొంటూ చివరకు అనుకున్న పనిని పూర్తి చేస్తుంటారు. ఇలాంటి...
Cameron Green: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు దీర్ఘకాలిక వ్యాధి ఉందని.. ఈ విషయం ఇప్పటివరకు దాచిపెట్టానని వివరించాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ఇది పూర్తిగా నయంకాని వ్యాధి అని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
AUS vs PAK: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్ ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఒక బంతికి ఏడు పరుగులు సాధించడంతో ప్రైమ్ మినిస్టర్స్ XI ఆటగాడు మాథ్యూ రెన్షా హాఫ్ సెంచరీ సాధించాడు.
Indian Man Dies In Australia: దేశం కాని దేశంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా దాతలను ఓ ఎన్నారై భార్య (NRI Wife) విన్నవిస్తోంది.
Team India: రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సాధించే అవకాశం ఉండగా.. ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 175 పరుగుల మార్క్ నిలిచింది.